AP CM JAGAN: రాష్ట్రాన్ని పారిశ్రామిక  హబ్ గా తీర్చిదిద్దుతాం: జగన్

AP CM JAGAN: రాష్ట్రాన్ని పారిశ్రామిక  హబ్ గా తీర్చిదిద్దుతాం: జగన్

ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి తమ నుంచి పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని  సీఎం జగన్ అన్నారు.  విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడారు.  రెండు రోజుల పాటు జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయిందన్నారు. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని జగన్  అన్నారు. మొత్తంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

ఏపీ ఇపుడు నూతన పారిశ్రామిక విధానాలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కొనసాగుతోందని జగన్ అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామిక  హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  మూడున్నర సంవత్సరాల్లోనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని తెలిపారు. వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా పారిశ్రామిక వేత్తలకు  కోవిడ్ సమంలో  సమయానుకూలంగా ప్రోత్సహించామని తెలిపారు.