అల్లూరి తెలుగుజాతికే కాదు దేశానికే స్పూర్తి

అల్లూరి తెలుగుజాతికే కాదు దేశానికే స్పూర్తి

మన దేశం పరాయ పాలకుల మీద యుద్ధం చేస్తూనే ముందుకు అడుగులు వేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధులు వారి రక్తాన్ని ధారపోసి మనకు స్వేచ్చను ఇచ్చారన్నారు. అడవిలో అగ్గి పుట్టించిన యోధుడు అల్లూరి అని సామాజిక ఐక్యమత్య అవసరాన్ని గుర్తించిన సంస్కర్త అని కొనియాడారు. అల్లూరి తెలుగుజాతికే కాదు దేశానికే స్పూర్తి ప్రధాత అన్నారు జగన్. ఆయన నడయాడిన నేలకు అల్లూరి పేరు పెట్టినట్లు తెలిపారు. తెలుగుజాతి ఎప్పటికీ అల్లూరిని మర్చిపోదని..అతని త్యాగం ప్రతి వ్యక్తి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. కాగా అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రధానికి సీఎం జగన్ స్వయంగా స్వాగతం పలికారు.