రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే.. జగన్ రద్దు చేస్తానంటున్నాడు

రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే.. జగన్ రద్దు చేస్తానంటున్నాడు

అప్పట్లో ఎన్టీఆర్ చేశాడు.. ఇప్పుడు జగన్ చేస్తానంటున్నాడు..

ఎన్టీఆర్ దారిలో జగన్..

అప్పట్లో బలం లేక మండలి రద్దు చేసిన ఎన్టీఆర్

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఏ బిల్లు వస్తుందో, ఏ బిల్లు రద్దవుతుందో తెలియక అటు ప్రజలు, ఇటు నాయకులు అయోమయంలో ఉన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు శాసనసభలో నెగ్గింది. అయితే ఆ బిల్లు శాసన మండలిలో మాత్రం నెగ్గలేకపోయింది. కారణం మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండి.. వైసీపీకి తక్కువ బలం ఉండటమే. అంతేకాకుండా మండలి చైర్మన్‌గా ఉన్న ఎంఏ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వ్యక్తి కావడం కూడా కారణం. ప్రస్తుంత ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీకి తగినంత మెజారిటీ లేదు. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం అధిక బలం ఉంది. దాంతో బిల్లు పాస్ కాకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఏపీ సీఎం జగన్.. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బిల్లు పాసవ్వడం సులభం.

కాగా.. టీడీపీ మాత్రం ఇంత తొందరగా మండలిని రద్దు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని అంటుంది. మండలిని రద్దు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అయితే గతంలో మండలిని రద్దు చేసిన ఘనత టీడీపీకి ఉంది. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో అధిక బలం ఉంది. కానీ మండలిలో మాత్రం కాంగ్రెస్‌దే హవా. కాంగ్రెస్‌కు మండలిలో ఉన్న బలంతో.. టీడీపీ పెట్టిన బిల్లులకు అడ్డు తగిలేది. దాంతో ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు.

అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ మండలిని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో 2007న మళ్లీ శాసనమండలి ఏర్పాటు చేస్తూ వైఎస్ ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. అప్పట్లో 1985లో మండలిని రద్దు చేసిన టీడీపీ ఇప్పుడు రద్దును వ్యతిరేకిస్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని ప్రవేశపెడితే.. ఆయన కొడుకు వైఎస్ జగన్ మండలిని రద్దు చేయాలని చూస్తున్నాడు. దీన్ని మొత్తంగా పరిశీలిస్తే.. అప్పుడు రద్దు చేసిన వాళ్లు ఇప్పుడు రద్దు చేయోద్దంటున్నారు… ఇప్పుడు రద్దు చేస్తామంటున్న వాళ్లు అప్పుడు ప్రవేశపెట్టారు.

For More News..

మూడు రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదు

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..