దళిత యువకుడిని కొట్టి..జుట్టు, మీసాలు తీసేశారు!

దళిత యువకుడిని కొట్టి..జుట్టు, మీసాలు తీసేశారు!

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల దౌర్జన్యం
ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకే దాడి చేశారన్న బాధితుడు
అమరావతి, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళిత యువకుడిని కొట్టిన పోలీసులు శిరో ముండనం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. స్థానిక వైసీపీ నాయకుడి అనుచరుడి కంప్లైంట్‌తో వెదుళ్ల‌పల్లికి చెందిన వరప్రసాద్‌ను సీతానగరం పోలీస్ స్టేషన్‌కు విచారణకు పిలిచి ఎస్ఐ కొట్టారు. జుట్టు, మీసాలు తొలగించారు. గాయపడిన బాధితుడిని రాజ మహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇసుక లారీలను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని బాధితుడు చెప్పాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో ఢీ కొట్టినట్లు ఆరోపించాడు.

సీఎం సీరియస్..

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. సీతానగరం పోలీసుల దాష్టీకాన్ని టీడీపీ నేత చంద్రబాబుతోపాటు ప్రతిపక్షాలు ఖండించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..