హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ కంప్లైంట్ చేసింది. వెంటనే ఉత్పత్తి పనులను ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి..కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురేకు శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద మొదలవ్వగానే, తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడం ప్రారంభించిందని లెటర్ లో ఆరోపించారు. ఈ చర్యతో శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటి మట్టం పడిపోయే ప్రమాదముందని అన్నారు.
