జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ : లక్కీ డ్రాలో చైర్మన్ గా బాలమణి

జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ : లక్కీ డ్రాలో చైర్మన్ గా బాలమణి

జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫిషియో ఓట్లు వేసిన తర్వాత కూడా రెండు పార్టీలకు సమానంగా వచ్చాయి. చైర్మన్, వైస్ ఎన్నిక టై కావటంతో.. నిబంధనల ప్రకారం అధికారులు డ్రా వేశారు. డ్రాలో.. కాంగ్రెస్ పార్టీ కౌన్సెలర్ బాలమణి చైర్మన్ గా ఎన్నికయ్యారు.

జనగామ జిల్లా జనగామ మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ చైర్మెన్ అభ్యర్థికి మొత్తం 16 ఓట్లు రాగా...బిఆర్ఎస్ పార్టీ చైర్మెన్  అభ్యర్థిగోపగాని సుగుణాకర్ కూడా 16  ఓట్లు వచ్చాయి.  దీంతో అధికారులు లక్కీ డ్రా వేశారు. ఇద్దరి పేర్లు రాసి డ్రా తీశారు. దీంతో లక్కీ డ్రాలో  కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణిని అదృష్టం వరించింది.

లక్కీ డ్రాలో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ కు దక్కడంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ముందు పల్లారాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేేశారు. పోలీసులు తీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు.