Weather Update : ఏపీకి తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

Weather Update : ఏపీకి తుఫాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండగా.. ఇది తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువ ఉంటుందని, మూడ్రోజుల పాటు( అక్టోబర్ 25 నుంచి)  వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్య కారులు  చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

 విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాన్...  బంగ్లాదేశ్‌లో తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేశారు. వాయుగుండం తుఫాన్ గా మారడంతో  వర్షాలు కురుస్తాయని చెప్పారు.  వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదలేకపోతున్నాయి. దీంతో ఇవి బలపడటానికి వారం రోజుల సమయం  పడుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.