
హైదరాబాద్, వెలుగు: దేశానికి 1947లో స్వాతంత్ర్య్ం వచ్చినా.. తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు స్వాతంత్ర్య ఫలాలను పొందడానికి 13 నెలలు ఆలస్యమైందని గుర్తుచేశారు.
బుధవారం విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పవన్ ఓ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిజాం ఏలుబడిలో రజాకార్లు సాగించిన అకృత్యాల వల్ల ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. రజాకార్లపై రైతాంగం చేసిన సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని పవన్ కల్యాణ్చెప్పారు.
తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.