Pawan Kalyan: భార్యతో సింగపూర్లో పవన్..ఎందుకో తెలుసా?

Pawan Kalyan: భార్యతో సింగపూర్లో పవన్..ఎందుకో తెలుసా?

పవర్ స్టార్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సింగపూర్‌ వెళ్లారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగే గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పవన్ అటెండ్ అయ్యారు. అయితే..పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా (Anna Lezhneva) మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.ఈ నేపథ్యంలో ఆమె శనివారం (జూలై 20న) డిగ్రీ పట్టా అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి విమానం ఎక్కేందుకు వెళుతున్న ఫోటోలు సైతం కనిపించడంతో ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు. అంతేకాకుండా..పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన అప్పటి నుంచి దీక్షా వస్త్రాల్లోనే కనిపించగా..ఈ ఈవెంట్ లో సింపుల్‌ ఫార్మల్‌ లుక్‌ కనిపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. 


 
పవన్ కళ్యాణ్, అన్నా  లెజినోవా తీన్ మార్ మూవీలో కలిసి నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ టైంలోవీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2013లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి పొలినా, మార్క్‌ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.