
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనని అన్నారు పవన్ కళ్యాణ్. గచ్చిబౌలిలో నిర్వహిం చిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్, ఉర్దూ, పర్షియన్ భాషలను అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమని అన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ వంటిదని అన్నారు.
మన రాజ్య భాష హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉందని.. సరిహద్దులు దాటితే మనకు రాజ్య భాష హిందీ అవుతుందని అన్నారు. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటే.. మన దేశం మొత్తం ఏకం కావడానికి రాష్ట్ర భాషను వెతుక్కుంటోందని అన్నారు పవన్ కళ్యాణ్.
►ALSO READ | బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు : మంత్రి పొన్నం
విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి కోసం అన్ని భాషలు, మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్తున్న సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల్ని అభివృద్ధికి దూరం చేసినవాళ్ళం అవుతామని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య వార్ నడుస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.