ఏపీ డీఎస్సీ ఫలితాల్లో సంచలనం.. ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించిన విద్యార్థిని

ఏపీ డీఎస్సీ ఫలితాల్లో సంచలనం.. ఏకంగా ఐదు ఉద్యోగాలు సాధించిన విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో సంచలనం సృష్టించింది మంగారాణి అనే విద్యార్థిని. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు ఉద్యాగాలు సాధించి రికార్డు సృష్టించింది. దాదాపు అన్ని జాబ్స్ టాప్-5 ర్యాంక్ లలోపే సాధించడం చర్చనీయాంశంగా మారింది. 

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదారం గ్రామానికి చెందిన నాగుల మంగారాణి ఒకే అటెంప్ట్ లో ఐదు ఉద్యోగాలు సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు.  లేటెస్ట్ గా వెలువడిన ఏపీ డిఎస్సీ ఫలితాలలో ST -నాయకపోడు , ST కేటగిరీలో జోన్ 2లో ఐదు ఉద్యోగాలు సాధించింది. 

స్కూల్ అసిస్టెంట్ (SA) రిజల్ట్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ లో ఫస్ట్ ర్యాంక్స్ (1వ ర్యాంక్) తో జాబ్స్ సాధించింది.  అదే విధంగా TGT  ఇంగ్లీష్ మీడియం రిజల్ట్స్ లో ఫిజిక్స్ ఫస్ట్ (1వ) ర్యాంక్, సైన్స్ సెకండ్ (2వ) ర్యాంక్ , మ్యాథ్స్ ఫోర్త్ (4వ) ర్యాంక్  సాధించింది. 

►ALSO READ | తిరుమల లడ్డు ప్రసాదం అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజులోనే..