విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశమిచ్చిన జగన్

విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశమిచ్చిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నలుగురిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు. ఒకరు జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య కాగా.. మరొకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. పాలనలో, పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి పాటు పడాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను ఖరారు చేశారని ఈ సందర్భంగా మంత్రి బొత్స, సజ్జల తెలిపారు. 

ఏపీ నుంచి రాజ్యసభ ఎన్నికపై సీఎం జగన్ క్లారిటీ..

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేరును అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీసీ నేత బీద మస్తాన్ రావులను అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ తో చర్చించి.. ఆ తర్వాత అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రకటించారు. 

 

 

ఇవి కూడా చదవండి

మంత్రి రోజాకు వింత అనుభవం

ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ నటి చేతన రాజ్ మృతి

భార్య మోసం, స్నేహితుడి ద్రోహం నుంచి దినేష్ కార్తీక్ ఎలా బయటపడ్డాడు ?