అరకు నుంచి అక్రమంగా గంజాయి

అరకు నుంచి అక్రమంగా గంజాయి

ఏపీలోని అరకు నుండి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హాశిష్ ఆయిల్ సప్లయ్ చేస్తున్న నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అరకు నుండి హైదరాబాద్ కు సరుకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అరకులో తక్కువ రేటుకు కొని హైదరాబాద్ లో ఎక్కువకు అమ్ముతున్నారన్నారు. నిందితులు మారుతీ షిఫ్ట్ కార్ లో గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడ్డారన్నారు. నిందితుల నుండి 120 కిలోల గంజాయి, 2 లీటర్ల హాష్ ఆయిల్, ఒక కారు. 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 

అరకు కు చెందిన వెంకట్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 
హైదరాబాద్ చింతల్ కు చెందిన నరసింహ చారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. చారీ పాత నేరస్తుడు.. గతంలో ఇతనిపై 3 కమిషనరేట్ల పరిధిలో కూడా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 8 మంది నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరరీలో ఉన్నారు. మరో కేసులో ఈస్ట్ గోదావరి చింతూర్ నుండి తెలంగాణ మీదుగా ముంబై కి గంజాయి సప్లయ్ చేస్తున్న ఆటో వాలాను అరెస్ట్ చేశారు పోలీసులు. 

నిందితులు గంజాయి ని ఆంధ్ర నుండి తెలంగాణా జహీరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర కు సప్లయ్ చేస్తున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన బదవత్ రవి అనే ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. చింతూరు కు చెందిన సురేష్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. మొత్తం 5 నిందితుల్లో నలుగురు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 102 కిలోల గంజాయి, ఒక ఆటో, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నాం. 

ఇవి కూడా చదవండి:

ముంబైలో ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ !

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రెడ్డి సంఘాలు