ఏపీలో అంగన్ వాడీల తొలగింపు

ఏపీలో అంగన్ వాడీల తొలగింపు

నిరసనలు తెలుపుతూ విధుల్లో చేరని అంగన్ వాడీలను తొలగించేందుకు  ఏప్పీ ప్రభుత్వం సిద్ధమయింది. ఎస్మా చట్టం కింద నోటీసులు జారీ చేసినా ఇంకా విధుల్లో చేరని వారిని తొలగించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గత కొంత కాలంగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీలను విధుల్లో చేరాలని కోరినప్పటికీ ఇప్పటివరకు కొందమంది అంగన్ వాడీలు విధుల్లో చేరలేదు. నోటీసులు జారీ చేసినా విధుల్లో చేరని సిబ్బందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంగన్ వాడీల చేపట్టిన ఛలో విజయవాడ ను భగ్నం చేశారు పోలీసులు. మరోవైపు జనవరి 24న ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. అంగన్ వాడీలకు రాష్ట్ర అఖిల పక్ష ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.