పోతిరెడ్డిపాడు పై ఏపీ స్పీడ్..

పోతిరెడ్డిపాడు పై ఏపీ స్పీడ్..

మన సర్కార్ మౌనం

సుప్రీం, కేంద్రం, అపెక్సు కూ దూరం దూరం

అమలుకు నోచుకోని సీఎం ప్రకటనలు..  ఇదే టైమ్​లో దూకుడుపెంచిన ఏపీ ప్రభుత్వం

కృష్ణా జలాలపై రోజుకో కొర్రీ.. వరుస ఫిర్యాదులు – పోతిరెడ్డిపాడు టెండర్లకు పిలుపు

ఆందోళనలో పాలమూరు రైతులు..సుప్రీంలో ఫిర్యాదుకు రెడీ..

శ్రీశైలం ప్రాజెక్టును కబ్జా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కు లపై కేసీఆర్ సర్కార్ పెదవి విప్పడం లేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ అంశాన్ని పట్టించుకోవటం లేదు. మన రాష్ట్రానికి వచ్చే నీటికి గండి కొట్టే ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచినా.. అడ్డుకునేం దుకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఏపీ చేష్టలతో గుం డె మండిన పాలమూరు రైతులే.. పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సైలెంట్గా ఉంటున్నదా..? ఏపీతో ఏదైనా కమిట్మెంట్ ఉందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు నుంచి పక్కా ప్లా న్ ప్రకారం పావులు కదుపుతోంది. ఇప్పుడు టెండర్లు పిలవడంతోపాటు అధికారికంగా అనుమతులు పొందేందుకు అడ్డదారులన్నీ వెతుక్కుం టోంది. రాయలసీమ కరువు తీర్చేందుకు తాము చేపట్టిన ప్రాజెక్టుకు ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా సాయం చేసి ఆదుకోవాలని ఏకంగా నీతి ఆయోగ్ ను కోరిం ది. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టుకు అనుమతులు లేవని గానీ, కృష్ణా నీటిని పెన్నా బేసిన్ కు తరలిస్తున్నామని గానీ చెప్పకుం డానే ఫైళ్లు కదుపుతోంది. గోదావరి నీటిని కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా లకు తరలిం చే ప్రాజెక్టుల నిధుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ ను కూడా ఏర్పా టు చేసిం ది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచ ఒక సీజన్ లో 200 టీఎంసీల నీటిని తీసుకునే సదుపాయం ఏపీకి ఉంది.

ఇప్పుడు ఇంకో 250 టీఎంసీలను మళ్లించేం దుకు కొత్త ప్రాజెక్టులు కట్టడం తెలంగాణ ప్రయోజనాలను గంగలో ముం చే ప్రమాదముంది. ప్రగతిభవన్ దాటని కేసీఆర్ రివ్యూ పోతిరెడ్డిపాడుపై వరుసగా మీడియాలో కథనాలు రావటంతో మే నెలలో రివ్యూ నిర్వహిం చిన సీఎం.. ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎంతవరకైనా సిద్ధమని ప్రకటిం చారు. ఎన్ని కోట్లయినా ఖర్చు చేసి నిష్ణాతులైన లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కేం ద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్ యూసీకి కంప్లయింట్ చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఒక కంప్లయిం ట్ రాయటం తప్ప చేసిం దేమీ లేదు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కనీసం అపెక్స్ కౌన్సిల్ పెట్టాలని కేం ద్రాన్ని కూడా కోరలేదు. కేం ద్రమే అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తామని చెప్పి ఎజెం డా పంపాలని కోరినా ఇంత వరకూ సర్కార్ పంపలేదు. ఏపీ ప్రాజెక్టులను ప్రభుత్వం అడ్డుకోకపోవటంతో.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులే ఎన్జీటీలో పిటిషన్ వేసి స్టే వరకూ తెప్పించారు. సుప్రీంలో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. గోదావరి మళ్లింపుపై ఏపీ వడివడిగా కృష్ణా డెల్టాతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు గోదావరి నీటిని తరలిం చడానికి ఏపీ వేగంగా అడుగులు వేస్తోంది. పోలవరం కుడి కాలువ కెపాసిటీని 50 వేల క్యూసెక్కులకు పెం చడంతోపాటు అనేక స్థాయిల్లో లిఫ్టుల ద్వారా చిత్తూరు జిల్లాలోని నగరి వరకు తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసిం ది. ఇప్పటి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలిస్తున్న ఏపీ.. పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి ద్వారా రాయలసీమకు నీటిని అందిస్తోం ది. కృష్ణా డెల్టా కోసమే పులిచింతల ప్రాజెక్టును కట్టింది. కృష్ణాలో ఫ్లడ్ డేస్ 30 నుం చి 35 రోజులకు పడిపోయాయని, ఆ రోజుల్లో నే తమకు కేటాయిం చిన నీటిని తీసుకునేం దుకు కొత్త ప్రాజెక్టులు కడుతున్నామని ఏపీ దర్జాగా చెప్తోంది.

ప్రతి నీటి బొట్టు కు ఏపీ కొర్రీలు

హైదరాబాద్ తాగునీటి లెక్కిం పు, కృష్ణా బేసిన్ కు తరలిస్తున్న గోదావరి నీళ్లలో వాటా, శ్రీశైలం ఎడమగట్టు పవర్ స్టేషన్ లో కరెం ట్ ఉత్పత్తి, గత ఫ్లడ్ సీజన్ లో క్యారీ ఓవర్ నీటి లెక్కలు, అదనంగా తీసుకున్న నీటిని ఎకౌం ట్ నుం చి మినహాయించేందుకు ఏపీ తనకు తానుగా నాగార్జునసాగర్ డ్రా లెవల్ ను ఐదు అడుగులకు తగ్గిం చుకోవడం, అందుకు తనదైన భాష్యాలు చెప్పుకోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ అగ్రెసివ్ గానే రియాక్ట్ అవుతోం ది. గోదావరిలోనూ అత్యధిక నీళ్ల వాటా తమదేనంటోంది. తెలంగాణ నిర్మి స్తున్న కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులు అక్రమమైనవేనని గోదావరి బోర్డుకు ఏపీ తేల్చి చెప్పింది.

గోదావరి, కృష్ణా .. రెండింటిపై నిర్లక్ష్యం

కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో మన ప్రభుత్వానికి ముందుచూపు కొరవడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు లింకులు రెడీగా ఉన్నా ప్రాణహిత వరద నీటిని ఎత్తిపోయడం లేదు. వానాకాలం మొదలై 50 రోజులైనా గోదావరి నుం చి ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోయలేదు. ఎస్సారెస్పీలో వరద కాలువ ద్వారా నీటి విడుదలకు చాన్స్​ ఉన్నా, రూ.లక్షల ఖర్చు తో ఎ ల్లం పల్లి నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసింది. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు నీరివ్వడం కన్నా ప్రచారం చేసుకోవడానికే ఆ ప్రాజెక్టును ఎక్కువగా ఉపయోగించుకుం టోంది. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే తుమ్మి డిహెట్టిని వద్దనుకొని మూడు దశల్లో ఎల్లంపల్లికి ఎత్తిపోసే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చేసింది. ఎత్తిపోతలకే ఏటా కోట్లు ఖర్చు కానుంది. కృష్ణాలో ఫ్లడ్ డేస్ 30 రోజులకు పడిపోయాయని ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే.. మన సర్కార్ 60 ఫ్లడ్ డేస్ లో నీటిని తరలిస్తా మని కొత్త భాష్యం చెప్తోం ది. పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్ స్కీమ్ లను పట్టించుకోవడం లేదు. మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ సర్కార్ ఇలాగే వ్యవహరిస్తోం ది. గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ కు మళ్లిం చే డెడికేటెడ్ ప్రాజెక్టు ఏదీ ఇంతవరకూ మొదలు పెట్టలేదు.