OTT Movie Review: ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నారు.. కానీ కథ వేరేలా! మీరు మాత్రం ఇలా చేయకండి!

OTT Movie Review: ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నారు.. కానీ కథ వేరేలా! మీరు మాత్రం ఇలా చేయకండి!

‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి అభిషేక్ దర్శకత్వం వహించారు. ఇందులో దీక్షిత్ శెట్టికి జోడీగా బ్రిందా ఆచార్య నటించారు. అలాగే సాధు కోకిల, శృతి హరిహరన్, గోపాలకృష్ణ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఓ గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉంటారు. ఈ క్రమంలో ఓ ప్లాన్ వేస్తారు. అలా ఎలక్షన్ టైంలో ఓ చిన్న దోపిడీకి ప్రయత్నించడంతో అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. దీంతో పాటు స్థానిక రాజకీయ నాయకుల నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ ఈ కథనం సాగిన తీరు ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది. 

కథేంటంటే:

కర్ణాటకలో ఎలక్షన్ సీజన్ మొదలవుతుంది. పొలిటికల్ లీడర్లు బ్లాక్ మనీతో ఓట్లు కొంటున్న టైం అది. అప్పుడే కనక అలియాస్‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (దీక్షిత్ శెట్టి) తన తెలివితో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని కలలుకంటాడు. దాంతో ఒక దోపిడీకి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తాడు.

►ALSO READ | WomenInCinema: నాటకాల స్టేజ్ నుంచి స్క్రీన్ వరకు.. మల్టీ టాలెంటెడ్గా నటి ఆండ్రియా ఇన్స్పిరేషన్ జర్నీ

తన గ్యాంగ్‌‌‌‌‌‌‌‌లోని మరో ఐదుగురితో కలిసి భాగ్యలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ని దోచుకునేందుకు వెళ్తాడు. ప్లాస్టిక్ యానిమల్ మాస్కులు, రెంటుకు తీసుకొచ్చిన పాత తుపాకులతో ఎలాంటి ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ లేకుండానే బ్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తారు.

కానీ, లాకర్​లో కేవలం రూ. 66,999 మాత్రమే ఉంటాయి. అక్కడినుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఫ్రంట్ డోర్ జామ్ అవుతుంది. అప్పటికే పోలీస్‌‌‌‌‌‌‌‌లు బ్యాంక్‌‌‌‌‌‌‌‌ను చుట్టుముడతారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.