చిరంజీవికి ఊరట.. ఆ కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

చిరంజీవికి ఊరట.. ఆ కేసును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

సెలబ్రిటీలపై, రాజకీయ నాయకులపై ఏదో ఒక సందర్భంలో పోలీసులు కేసులు నమోదు అవుతూ ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలపై పోలీసు కేసు నమోదు అవ్వడం చాలా అరుదైన విషయం. కానీ పొలిటికల్ లీడర్స్ పై తరచుగా కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై గతంలో నమోదు అయిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఎన్నో సంవత్సరాలుగా పోలీసు కేసును ఎదుర్కొంటున్న మెగాస్టార్ కు ఈ కేసు నుంచి ఊరట లభించింది. అసలు మెగాస్టార్ పై నమోదు అయిన కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా, నెంబర్ వన్ హీరోగా తెలుగు తెరపై తనదైన ముద్రను వేశారు. రాజకీయల నుంచి తప్పుకున్నాక ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు మెగాస్టార్. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన కేసును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు తొమ్మిదేళ్లు కోర్టులో నలుగుతూ వస్తున్న ఈ కేసుకు విముక్తి లభించింది. చిరంజీవి సినిమాలను వదిలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 

రాజకీయాల్లో చిరుకు కలిసి రాలేదు. దీంతో కొన్నాళ్ళు ఆయన కాంగ్రెస్ కు ప్రచారకర్తగా మారారు. 2014 ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి గుంటూరులో ప్రచార సభ ఏర్పాటు చేశారు.  చిరు మీటింగ్ అనేసరికి మెగా ఫ్యాన్స్ ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. ఇక ఎన్నికల కోడ్ ప్రకారం.. ప్రభుత్వం ఎంత సమయం ఇస్తే అంతే సమయంలో సభను ముగించాలి. కానీ, చిరు నిర్ణీత సమయంలో సభను ముగించకపోవడంతో ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్లు కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు హైకోర్టులో నలుగుతూనే ఉంది. ఆ తరువాత చిరు.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను పరిసరిశీలించిన న్యాయస్థానం తాజాగా కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిరుకు ఊరట లభించింది.

 ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే భోళా శంకర్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా మలయాళ హిట్ సినిమా బ్రో డాడీకి రీమేక్ అని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం చిరంజీవి, ఆగష్టు 2011 లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు.  ఏపీ రాజకీయాల నుంచి మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల క్రితమే విరమించుకున్నా.. ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రాజకీయాల కన్నా సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవిపై నమోదు అయిన కేసు ఏపీ హైకోర్టు కొటివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.