సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకొవద్దు

సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకొవద్దు

టీడీపీ అధినేత చంద్రబాబు క్యాష్ పిటిషన్ ను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు.  స్కిల్ డెవ్ లప్ మెంట్  స్కాం కేసు  , ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్ ను విచారించిన హైకోర్టు..  ఇరువైపుల వాదనలు పూర్తిస్థాయిలో వినాల్సి ఉందన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. 

స్కిల్   స్కాంలో మరింత దర్యాప్తు చేయాలని  ఇందులో భాగంగా చంద్రబాబును విచారించాల్సి ఉందని సీఐడీ అభిప్రాయపడింది. ఈ మక్రమంలో చంద్రబబాను ఐదు రోజుల పాటు రిమాండ్ కు ఇవ్వాలని కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది.   ఈ పిటిషన్  విచారణ సందర్భంగా   చంద్రబాబును కస్టడీకి ఇవ్వొద్దంటూ ఆయన తరపు లాయర్లు వాదించారు.  దీనిపై  సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని  హైకోర్టు ఆదేశించింది.  సెప్టెంబర్ 18 వరకు  విచారణ చేపట్టొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాంలో 271 కోట్లు గోల్ మాల్ జరిగిందని సీఐడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో చంద్రబాబుపై 409 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది.  విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు సెప్టెంబర్ 22 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నారు.