స్థానిక ఎన్నికల రద్దుపై అత్యవసర విచారణకు ఏపీ హైకోర్టు నో

స్థానిక ఎన్నికల రద్దుపై అత్యవసర విచారణకు ఏపీ హైకోర్టు నో

అమరావతి: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై అత్యవసర విచారణకు హైకోర్టు నో చెప్పింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు ఎన్నికలకు వెళ్లేదిలేదంటూ భీష్మించిన అధికార వైసీపీ పార్టీ.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. కరోనా రెండో దశ వ్యాప్తి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండడం వల్ల ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, దీనిపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిన నేపధ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్ అత్యవసర విచారణకు పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగింది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల ప్రక్రియ యధావిధిగా కొనసాగేలా చూడాలని కోరుతూ పిటిషన్ లో అప్పీల్ చేసింది. అయితే అత్యవసర విచారణ వినతిని హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ ఇవాళ వెకేషన్ బెంచ్ ముందుకు రాగా ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈనెల 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నందున అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు కేసు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి..

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాక