సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్​ 5 జోన్​ వివాదం ముడిపడేనా? 

సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్​ 5 జోన్​ వివాదం ముడిపడేనా? 

జీవో నెంబరు 45పై  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్‌ను ఏపీ హైకోర్టు   ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్‍పై సుప్రీంకోర్టును అమరావతి రైతులు ఆశ్రయించనున్నారు. ఈరోజు ( మే6)స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు. ఎస్‍ఎల్‍పీలో న్న జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ కానున్నారు. ఆర్5 జోన్‍లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలిస్తే అన్యాయం జరుగుతుందని శ్రవణ్ కుమార్ వాదించనున్నారు. రాజధాని ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని తెలపనున్నారు. సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా జడ శ్రవణ్ కుమార్ వాదనలను వినిపించనున్నారు.

 సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్‌ - 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1134 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే రైతుల పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు.