
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయంపై హైకోర్టు స్టే విధించింది. జీవో 69ను నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి అనుమతిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో 69 ను జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బుక్ మై షో, విజయవాడ డిస్ట్రిబ్యూటర్లు, మల్టీప్లెక్సులు హైకోర్టులో పిటిషన్లు దాఖాలు చేశాయి. రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.