
ఒంగోలులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వివరాలను ప్రకాశం SPని అడిగి తెలుసుకున్నారు. రేప్ చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకున్నామని తెలిపిన ఎస్పీకి, అభినందనలు తెలిపారు సీఎం. నిందితులను పట్టుకున్నవారికి పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రికి సీఎం ఆదేశాలు చేయగా..రూ. 5లక్షలు ఇస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని తెలిపారు సీఎం జగన్.