- పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పిట్లం, వెలుగు : పిట్లంలో అయ్యప్ప ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా పుష్కర కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. గురువారం గోపూజ, చతుర్వేద పారాయణం, చండీసప్తపది హననం, సాయంత్రం మహా మంగళహారతి, మహా మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.
జగద్గురు హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ, మధుసూదనానందన సరస్వతీ స్వామీజీలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో పిట్లం సర్పంచ్ శేఖర్, కాంగ్రెస్ లీడర్లు రాంరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
