
ఏపీ ఇంటర్ రిజల్ట్ ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు కార్యదర్శి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేస్తారని ప్రకటించింది. రిజల్ట్ రోజే సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీలను ప్రకటించనున్నారు.
ఈ ఏడాది రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులు కలిపి ఫస్టియర్ కు 5లక్షల 17 వేల 617 మంది ,సెకండియర్ ఇంటర్ కు 5లక్షల35 వేల 56 మంది అప్లై చేసుకున్నారు. అయితే 9 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఏపీ ఇంటర్ రిజల్ట్ ను httsps://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు.