ఏపీలో జూన్ 10 వరకు లాక్ డౌన్

V6 Velugu Posted on May 31, 2021

  • కర్ఫ్యూ సడలింపు టైమింగ్స్ యధాతథం
  • గతంలో మాదిరే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ సడలింపు

అమరావతి: కరోనా కేసుల ఉధృతి నేపధ్యంలో లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 31తో లాక్ డౌన్ విధింపు గడువు ముగుస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ్టితో లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగించింది ప్రభుత్వం. కర్ఫ్యూ సడలింపులు వేళల్లో ఎలాంటి మార్పులు లేవని.. గతంలో అంటే ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు యధాతథంగా అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యా సంస్థలకు జూన్ నెలాఖరు వరకు సెవులు ప్రకటిస్తూ నిన్ననే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Tagged , ap covid effect, ap lock down, extended june 10th, corona effect in ap, ap curfew timings

Latest Videos

Subscribe Now

More News