ఒక్క దెబ్బకే రాత మారిపోయింది: వజ్రాల వేటలో ఏపీ వ్యక్తికి జాక్ పాట్

ఒక్క దెబ్బకే రాత మారిపోయింది: వజ్రాల వేటలో ఏపీ వ్యక్తికి జాక్ పాట్

లక్ష్మీ దేవి ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‎లో జరిగింది. ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది. కొడితే ఒకేసారి లక్షాధికారి అయ్యాడు. కూలీ పనులు చేసే కామన్ మ్యాన్ ఒకే దెబ్బకు రూ.30 లక్షలు సంపాదించాడు. ఒకేసారి రూ.30 లక్షలు సంపాదించడం ఏంటి..? అసలు ఇంతకు అతడు చేసిన పని ఏంటి అనుకుంటున్నారా..? అయితే అదేంటో తెలుసుకుందాం మరీ. 

తొలకరి జల్లులు పడితే ఆంధ్రప్రదేశ్‎లోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాల వేట మొదలైతుంది. కర్మకాలి ఒక్క వజ్రం దొరికిన తల రాత మారుతుందనే ఉద్దేశంతో ప్రజల వజ్రాల కోసం భూమిని జల్లెడ పడతారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, మహానంది, మహాదేవపురం ప్రాంతాలలోని ఎర్రనేలల్లో ఎక్కువ వజ్రాల వేట సాగుతోంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా తొలకరి జల్లులు మొదలయ్యాయి. 

2025, మే 26వ తేదీనే నైరుతి రుతుపవనాలు ఏపీ తీరాన్ని తాకాయి.ఈ ప్రభావంతో రాష్ట్రంలో తొలకరి చినుకులు పడుతున్నాయి. దీంతో ప్రజల డైమండ్ హంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా పత్తికొండ పరిధి పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జాట్ పాట్ తగిలింది. సదరు వ్యక్తి అదృష్టాన్ని నమ్ముకుని ఎప్పటి నుంచో వజ్రాల కోసం గాలిస్తుండగా.. 2025, మే 26న అతడి కోరిక నేరవేరింది. 

సదరు వ్యక్తికి సోమవారం (మే 26) వజ్రాం దొరికింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు వ్యాపారులకు దొరికిన వజ్రాన్ని రూ.30 లక్షలకు అమ్ముకున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.కోట్లలో ఉండే ఛాన్స్ ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వ్యక్తి వజ్రం దొరికిన మాట ఆ నోట ఈ నోట స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిసింది. దీంతో పోలీస్ , రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు.