ప్యాకేజీ తీసుకొని చంద్రబాబును భుజాన ఎత్తుకోవడానికి పవన్​ సిద్ధమా: మంత్రి అంబటి రాంబాబు

ప్యాకేజీ తీసుకొని చంద్రబాబును భుజాన ఎత్తుకోవడానికి పవన్​ సిద్ధమా: మంత్రి అంబటి రాంబాబు

పవన్ కల్యాణ్ పై( Pawan Kalyan )  మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  జగన్​ సిద్దమంటే ... మేమూ సిద్దమన్న పవన్​ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్​ ఇచ్చారు.  జనసేన దేనికీ సిద్ధం గా ఉందో చెప్పాలన్నారు.ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధమా? లేక చంద్రబాబును భుజాన ఎత్తుకుని తిరగడానికి సిద్ధమా? అనేది చెప్పాలన్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధమా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల బరిలో సీఎం జగన్( CM Jagan ) అర్జునుడిలా ప్రవేశిస్తారన్న ఆయన ... ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి విషపూరితమైన రాజకీయ నేత ఎవరూ లేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు కంటే నల్లత్రాచు బెటర్ అని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కూడా సిద్ధమని అంటున్నారని, చంద్రబాబు, ఆయన సైన్యం జగన్ పై బురద జల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. ప్రజలు జగన్ ను ముఖ్యమంత్రిగా దించడానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని, మధ్యలో దిష్టిబొమ్మల్లా చంద్రబాబు, పవన్ ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు.

 చంద్రబాబు సభలకు జనం కరువయ్యారన్నారు. తనది విజన్ అట.. జగన్ పాయిజన్ అట అంటూ ఎద్దేవా చేశారు.  ఎన్నికలు పూర్తయిన వెంటనే తట్టాబుట్టా సర్దుకుని చంద్రబాబు, పవన్, లోకేష్ లు హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మేనిఫేస్టోను వెబ్‌సైట్ నుంచి తొలగించడమే చంద్రబాబు విజన్ అని అన్నారు.