ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం... ఎప్పుడంటే..

ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం... ఎప్పుడంటే..

ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.  చంద్రబాబు రా కదలిరా సభల్లో వైసీపీ విమర్శిస్తుంటే... మరో పక్క కొత్తగా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షురాలిగా బాధ్యదలు చేపట్టిన షర్మిల ఇటు చంద్రబాబు.. అటు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతుంది.  ఇదిలా ఉండగా అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. సోమవారం ( జనవరి 29) స్పీకర్ వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను విచారణకు రావలసినదిగా నోటీసులు జారీ చేశారు.  వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి ( జనవరి 29)  విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు.

మరోవైపు.. మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు ఉంది. కాగా.. ఈ ఎమ్మెల్యేల హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి (జనవరి 29)  విచారణకు హాజరు కాలేమని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సమాచారం ఇచ్చారు. అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. అతనితో పాటు మరో రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేమని తన వర్గం స్పీకర్ కు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. ఆనం, కోటంరెడ్డి హాజరు పై ఇంకా స్పష్టత రాలేదు.