అన్న జగన్ వల్లే మా కుటుంబం చీలింది : షర్మిల

అన్న జగన్ వల్లే మా కుటుంబం చీలింది : షర్మిల

కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని జగన్ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. YSR కుటుంబం చీలింది అంటే చేతులారా చేసుకున్నది జగన్ అన్న గారే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని వివరించారు. యావత్‌ కుటుంబం దీనికి సాక్ష్యంగా ఉన్నరని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందకుండా.. దయనీయ స్థితిలో ఉండటానికి జగన్, చంద్రబాబే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గతంలో 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న గారి వైపు నిలబడితే.... అధికారంలోకి వచ్చాక వాళ్లను మంత్రులను చేస్తానని మాట తప్పారని విమర్శించారు.  వాళ్ల గెలుపుకోసం అమ్మ నేను వాళ్ల గెలుపునకు ఎంతో పాటుపడ్డామని షర్మిల తెలిపారు. 

వైసీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనను పాదయాత్ర చేయమంటే.. నా కుటంబాన్ని పక్కన పెట్టి ... ఎండనక, వాననక రోడ్లపై తిరిగానన్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా... వైసీపీ పెద్దలు ఎప్పుడు అడిగితే  నిస్వార్థంగా,, స్వలాభం లేకుండా.. ఎందుకు అని అడగకుండా జగన్ పార్టీకి అండగా ఉంటే ఇప్పుడు సీఎం సీట్లో కూర్చొని  జగన్ మోహనరెడ్డి మారిపోయారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  తనకు వ్యక్తిగతంగా అన్యాయంగా... చేసిన వైఎస్సార్ పేరు .. ఆశయాలను నిలపెడితారని ఎంతో ఆశపడ్డానని ... కాని జగన్ ప్రభుత్వం  ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు.  ఏపీలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టకపోయినా ఆ పార్టీ రాజ్యం ఏలుతుందని... సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. 

గతంలో ఏ ప్రభుత్వాలు చేయని సాహసం వైఎస్సార్ చేశారని... 2004 లో సీఎం అయిన నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తే... ఆయన డ్రీమ్ ను వైఎస్సార్ మరణించిన తరువాత టీడీపీ, వైసీపీ పార్టీలు నిర్లక్ష్యం చేశాయన్నారు.  కాంగ్రెస్ పార్టీ పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే  బాబు అధికారంలోకి వచ్చిన తరువాత అంచనా వ్యయం పెంచడం తప్ప ఏమీ చేయలేదన్నారు.  వైసీపీ హయాంలో వైఎస్సార్ పథకాలు ఒక్కటి అమలు కావడం లేదంటూ.. - వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా ఉంటే..జగన్     అన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగగా మారిందన్నారు.