ఏపీ అన్నమయ్య జిల్లాలో కార్లలో ఎర్రచందనం స్మగ్లింగ్.. 15 మంది అరెస్ట్..

ఏపీ అన్నమయ్య జిల్లాలో కార్లలో ఎర్రచందనం స్మగ్లింగ్.. 15 మంది అరెస్ట్..

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కార్లలో అక్రమంగా తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. బుధవారం ( సెప్టెంబర్ 10 ) జిల్లాలోని సానిపాయ అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సానిపాయ, వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా.. కార్లలోకి ఎర్రచందనం లోడింగ్ చేస్తున్నట్లు గమనించామని తెలిపారు పోలీసులు.

ఎర్రచందనం స్మగ్లింగ్ ను గమనించిన పోలీసులు కార్లలోకి లోడ్ చేస్తున్న దుంగలను స్వాధీనం చేసుకొని.. 15 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశామని.. వారి దగ్గర నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారని.. అయితే  వారిని వెంబడించి 15మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

►ALSO READ | తిరుమల వెంకన్నకు పింక్ డైమండే లేదు.. అది కెంపు మాత్రమే

పట్టుబడిన వారిని అన్నమయ్య, చిత్తూరు,  జిల్లాలకు చెందిన వారుగా గుర్తించామని... వాహనాలు, దుంగలతో సహా వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.