కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్

ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాల్లో ఏపీ జల దోపిడీ పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 
>>> ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో శ్రీశైలం ప్రాజెక్టుకు 10 వేల 665 టీసీఎంల నీళ్లు వస్తే.. ఏపీ రాష్ట్రం అదనంగా 727 టీఎంసీల నీళ్లు దోచుకుంందని స్పష్టం చేశారు. 
>>>  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో.. 2014 నుంచి 2023 వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు 8 వేల 993 టీఎంసీల నీళ్లు వస్తే.. ఆంధ్రప్రదేశ్ 12 వందల టీఎంసీలు అదనంగా నీళ్ల దోపిడీకి పాల్పడిందని లెక్కలతో సహా వివరించారు మంత్రి ఉత్తమ్.

also read : KRMBకి ప్రాజెక్టులు.. అప్పగించేదే లేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

>>>  కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 50 శాతం అదనంగా నీళ్ల దోపిడీ జరిగిందని వివరించారు.
>>> కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి రాక తగ్గినా.. జల దోపిడీ పెరిగిందని లెక్కలతో సహా వివరించారు.
>>> కృష్ణా బేసిన్ లో ఇన్ ఫ్లో భారీగా తగ్గినా.. నీళ్ల డైవర్షన్ పెరిగిందని.. కృష్ణా జలాలను ఏపీకి కట్టబెట్టి.. ఏపీ సీఎం జగన్ కు లబ్ది చేకూర్చారని వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.