విశాఖలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకంటే..

విశాఖలో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష.. ఎందుకంటే..

ఏపీసీసీ అధ్యక్షురాలు .. వైఎస్​ షర్మిల విశాఖ స్టీల్​ ప్లాంట్​ కార్మికులకు అండగా నిలిచారు.    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని  షర్మిల డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్షకు దిగడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆమెను స్వాగతించారు. 

ALSO READ | ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు.. డిప్యూటీ సీఎం పవన్​కళ్యాణ్​ కు అప్పగించిన సీఎం సిద్దరామయ్య

కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ... ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష...  ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే చేస్తానని ఆమె ప్రక‌టించారు. అయితే.. ఈ ప్రక‌ట‌న‌పై ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డంతో.. ఆమె  అన్నట్టుగానే  దీక్షకు కూర్చున్నారు...తాను ఎందుకు నిరాహార దీక్ష చేయాల్సి వ‌స్తోందో .. ఆమె ప్లకార్డుల రూపంలో ప్రద‌ర్శించారు. 

ఇవీ ష‌ర్మిల డిమాండ్లు..

  • తొల‌గించిన కార్మికుల‌ను త‌క్షణం విధుల్లోకి తీసుకోవాలి.
  • ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించ‌బోమ‌ని ప్రక‌ట‌న చేయాలి.
  • విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి శాశ్వత బొగ్గు గ‌నులు కేటాయించాలి.
  • ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న‌లు తొల‌గించి.. వారి ఉద్యోగాల‌కు భ‌ద్రత క‌ల్పించాలి.
  • ఇటీవ‌ల ఇచ్చిన 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను గ్రాంటుగా ప్రక‌టించాలి.
  • ఉక్కు క‌ర్మాగారానికి త‌క్షణ‌మే మ‌రో 50 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఇవ్వాలి.