
ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా..... రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి నాలుగు కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించారు. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పవన్ కల్యాణ్ కు అందజేశారు.
ALSO READ | ఇక రేషన్ వాహనాలు కనిపించవు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..
శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు. ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ... ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి అప్పగించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...కుంకీ ఏనుగులు అందించిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందని చెప్పారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ఏపీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.