శోభన కామినేని ఓటు గల్లంతు

శోభన కామినేని ఓటు గల్లంతు

అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ శోభన కామినేని ఓటు గల్లంతైంది. ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశానని చెప్పారు శోభన. వారం క్రితం ఓటుగురించి వాకబు చేయగా లీస్టులో ఉందని తెలిపారు. అయితే ఆ వారం మధ్యలో బిజినెస్ పనులపై విదేశాలకు వెళ్లి వచ్చి.. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రాగా.. లిస్టులో ఓటు లేదని అన్నారు.

శోభన కూతురు ఉపాసన మాత్రం భర్త రామ్ చరణ్, మామ మెగాస్టార్ చిరంజీవితో కలిసి జూబ్లీహిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.