వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 100 బెడ్స్ ఆస్పత్రి కోసం కొనసాగుతున్న దీక్ష

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 100 బెడ్స్ ఆస్పత్రి కోసం కొనసాగుతున్న దీక్ష

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని కోరుతూ వర్ధన్నపేట సాధనా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష నాలుగో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక యువత బైక్ ర్యాలీ నిర్వహించింది. దీక్షలో వర్ధన్నపేట జడ్పీ హైస్కూల్ 1990– 91 బ్యాచ్ టెన్త్​ విద్యార్థులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాందాన్ తండా సర్పంచ్ వెంకన్న సంఘీభావం తెలిపి, దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినంత మాత్రాన నిర్ణయాలు మార్చడం సరి కాదన్నారు. రెండేండ్ల కిందనే శంకుస్థాపన చేసి, నిధులు విడుదల విడుదల చేయగా, ఆస్పత్రిని మరో చోటుకి తరలించడం సిగ్గుచేటన్నారు. వర్ధన్నపేట సాధనా సమితి సభ్యులు, అఖిలపక్ష నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.