తన పరిస్థితి ఎవరికీ రావొద్దని యాప్​ రూపొందించిన తొమ్మిదేళ్ల బాలిక

తన పరిస్థితి ఎవరికీ రావొద్దని యాప్​ రూపొందించిన తొమ్మిదేళ్ల బాలిక

ఆ బాలిక పేరు మీయిదాయిబాహన్ మెజావ్… వయసు తొమ్మిదేళ్లు.. చదువుతోంది నాలుగో తరగతి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్​కు చెందిన ఆ అమ్మాయి స్కూల్​​లో వేధింపులను ఎదుర్కొంది. తోటి స్టూడెంట్స్ ఆమెను తరచూ ఏడిపించేవారు. ఆమె స్నేహితులకూ అలాంటి పరిస్థితులే ఎదురవడం చూసి చలించిపోయింది. దీనికి పరిష్కారంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఓ యాప్ రూపొందించాలని అనుకుంది. వెంటనే యాప్ డెవలప్ మెంట్ కోర్సులో చేరిపోయింది. కొద్ది నెలల్లోనే అది పూర్తి చేసి ‘యాంటీ బుల్లీయింగ్’ యాప్​ను రూపొందించింది. బాధితులు తమ వివరాలు తెలపకుండా తాము ఎదుర్కొన్న సమస్యలను పేరెంట్స్, టీచర్లు, ఫ్రెండ్స్​కు తెలియజేసేలా దీన్ని తయారు చేసింది. తద్వారా ఇలాంటి అల్లరి పనులు చేస్తున్న స్టూడెంట్లపై చర్యలు తీసుకునేలా సొల్యూషన్ కనుక్కుంది. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్​లో అందుబాటులోకి రానుంది. మేఘాలయ ఎడ్యుకేషన్ మినిస్టర్ మెజావ్​ను ప్రత్యేకంగా అభినందించారు.

 మెసేజ్​తో సమాచారం

‘‘నేను నర్సరీ నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాను. అవి నాపై ఎంతో ప్రభావం చూపాయి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఈ యాప్​ తయారు చేశా” అని మెజావ్ చెప్పింది. ‘‘ఒకసారి నలుగురైదుగురు స్టూడెంట్లు నన్ను చుట్టుముట్టారు. నా స్నేహితులను వెళ్లిపొమ్మని బెదిరించారు. అందులో ఒకడు నా పాదంపై తొక్కాడు” అని తనకు ఎదురైన సంఘటన గురించి వివరించింది మెజావ్. ‘‘యాప్ యూజర్లు తమకు ఎదురైన సంఘటన వివరాలు, వారిని ఏడిపించిన వ్యక్తి పేరుతో సహా తాము చెప్పాలనుకుంటున్న వారికి మెసేజ్​ ద్వారా చెప్పొచ్చు”అని తెలిపింది. తమ రిసార్ట్​ కోసం ఓ యాప్​తో పాటు 40 యాప్స్​ తయారు చేస్తోందట మెజావ్​.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం