శాంసంగ్‌, ఎల్జీకి యాపిల్ షాక్

శాంసంగ్‌, ఎల్జీకి యాపిల్ షాక్

టెక్ దిగ్గజం యాపిల్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ కంపెనీ తయారుచేసే డిస్‌ప్లేలను మాత్రమే వాడనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎల్‌జీ, శాంసంగ్ కంపెనీలపై పెను ప్రభావం పడనుంది. చాలా ఏండ్లుగా యాపిల్ తమ ప్రొడక్ట్స్ అన్నింటిలో శాంసంగ్, ఎల్‌జీ డిస్‌ప్లేలనే వాడుతోంది. ఇకపై సొంత డిస్ ప్లేలు వాడాలని యాపిల్ నిర్ణయించుకోవడంతో ఆ రెండు కంపెనీలకు భారీ దెబ్బ తగలనుంది. 

డిస్‌ప్లే ప్రొడక్షన్ ఇప్పటికే మొదలుపెట్టడంతో యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది నుంచి తమ ఉత్పత్తుల్లో వాటినే వాడనుంది. తొలి దశలో యాపిల్ తమ వాచ్‌లలో సొంత డిస్‌ప్లేలను వాడుతోంది. క్రమంగా ఐఫోన్, ఐపాడ్స్‌లోనూ వాటిని ఉపయోగించేందుకు రెడీ అవుతోంది. యాపిల్ ప్రస్తుతం ఉన్న ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే స్థానంలో మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను తీసుకొస్స్తాతోంది. వీటి వల్ల పిక్చర్ క్వాలిటీ, కలర్స్ ఇంకా బ్రైట్‌గా కనిపిస్తాయని కంపెనీ చెప్తోంది.
  
 

మరిన్ని వార్తలు