యాపిల్ ఆఫీస్ కిరాయి వెయ్యి కోట్లు! పదేళ్లలో ఖర్చు చేయనున్న కంపెనీ

యాపిల్ ఆఫీస్ కిరాయి వెయ్యి కోట్లు! పదేళ్లలో ఖర్చు చేయనున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్  బెంగళూరులోని ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్లకు  లీజుకు తీసుకుంది. డేటా ఎనలిటిక్స్ కంపెనీ ప్రాప్‌‌‌‌స్టాక్‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, నెల అద్దె రూ.6.3 కోట్లు. ఈ పదేళ్లలో రెంట్‌‌‌‌, కార్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌, మెయింటెనెన్స్ వంటి మొత్తం ఖర్చులు కలుపుకుంటే రూ. వెయ్యి కోట్లకు పైగా అవుతుంది.  

ఎంబసీ గ్రూప్ నుంచి 5వ అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు 9 ఫ్లోర్లు, కార్ పార్కింగ్ సహా లీజుకు తీసుకుంది.  లీజు ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది. అద్దె ప్రతి సంవత్సరం 4.5శాతం పెరుగుతుంది. యాపిల్  రూ.31.57 కోట్ల డిపాజిట్ చెల్లించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శించినప్పటికీ కంపెనీ  భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.  

బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌లలో  ఇంజినీరింగ్ టీమ్‌‌‌‌లు ఉన్నాయి.   యాపిల్‌‌‌‌  2024–-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి    రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను  ఎగుమతి చేసింది. మన దేశ  మొబైల్ ఎగుమతుల్లో 
మొదటి స్థానంలో ఉంది.