రూ.34 కోట్లు సేకరించిన అప్లయన్స్​

రూ.34 కోట్లు సేకరించిన అప్లయన్స్​

 న్యూఢిల్లీ: కిచెన్​ సామాన్లు అమ్మే స్టార్టప్ అప్లయన్స్​ ఏఐ..  వెంచర్ క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్స్ నుంచి రూ. 34 కోట్లు (సుమారు 4 మిలియన్లు) సేకరించింది. రూ. 143 కోట్ల (17 మిలియన్ల డాలర్ల) వాల్యుయేషన్ వద్ద  ఈ ఫండ్స్ సేకరించింది.  బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ తాజా నిధులను ఉత్పత్తికి, విస్తరణకు ఉపయోగిస్తుంది. ఈ సంస్థ దాదాపు 1,000 అప్లయన్సెస్​ను విక్రయించింది. 80శాతం ఆర్డర్‌‌‌‌‌‌‌‌లు కంపెనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ నుంచే వచ్చాయి. అప్లయన్స్​ ఏఐ తన ఆదాయాన్ని  రూ. 150 కోట్లకు పెంచాలని చూస్తోంది.