ఎలక్ట్రికల్ సూపర్‌‌వైజర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

ఎలక్ట్రికల్ సూపర్‌‌వైజర్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
  • స్టేట్ ఎలక్ట్రికల్ ​లైసెన్సింగ్ ​బోర్డు

హైదరాబాద్ , వెలుగు: ఎలక్ట్రికల్ సూపర్‌‌వైజర్, వైర్‌‌మెన్ పర్మిట్ కోసం అర్హులైన అభ్యర్థులు సీఈఐజీ వెబ్​సైట్​లో దరఖాస్తులు చేసుకోవాలని స్టేట్​ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు సెక్రటరీ కాంతారావు తెలిపారు.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్​, డిగ్రీ/ డిప్లొమా, ఐటీఐ (ఎలక్ట్రీషియన్) చేసిన అభ్యర్థులు సూపర్​ వైజర్, వైర్‌‌మెన్ పర్మిట్ కోసం http://tgceig.cgg.gov.in వెబ్​సైట్​లో లాగిన్​ అయి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

అభ్యర్థులు ముందుగా సుల్తాన్​ బజార్ లోని సెయింట్​ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ జారీచేసిన పవర్ మెడిసిన్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు.  ఎలక్ట్రికల్​ సూపర్ వైజర్ పర్మిట్ పొందేందుకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్ లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్​లో పాలిటెక్నిక్​ డిప్లొమా  ఉత్తీర్ణత సాధించాలన్నారు. సూపర్ వైజర్ పర్మిట్ కోసం కనీస ఎక్స్​పీరియన్స్​ ఉండాలనిపేర్కొన్నారు.