ఎస్‌‌‌‌బీఐ సర్కిళ్లలో 1422 సీబీవో పోస్టుల భర్తీకి అప్లికేషనన్స్

ఎస్‌‌‌‌బీఐ సర్కిళ్లలో 1422 సీబీవో పోస్టుల భర్తీకి అప్లికేషనన్స్

ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్‌‌‌‌ సెంటర్​ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌‌‌‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి అప్లికేషనన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలి. హైదరాబాద్ సర్కిల్‌‌‌‌లో 176 ఖాళీలున్నాయి.

అర్హతలు: మొత్తం 1422 పోస్టుల్లో రెగ్యులర్​ ఖాళీలు 1400, బ్యాక్​లాగ్​ పోస్టులు 22 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 2022 సెప్టెంబర్​ 30 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం రూ.36000- నుంచిరూ.63840 ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌‌‌‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్‌‌‌‌కతా, మహారాష్ట్ర, నార్త్‌‌‌‌ ఈస్టెర్న్‌‌‌‌ సర్కిళ్లలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 7వరకు అప్లికేషన్​ ఫీజు  రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్ కార్డుల డౌన్‌‌‌‌లోడ్ నవంబర్​ లేదా డిసెంబర్​లో ఉంటుంది. ఆన్​లైన్​ పరీక్ష డిసెంబర్​ 4న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్​ సంప్రదించాలి.