పలు కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పలు కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

టీఎస్ ఎడ్‌‌సెట్-2020

రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేష‌‌న్‌‌ల‌‌లో బీఈడీ ప్రవేశాలకు గాను ఏటా నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎడ్యుకేష‌‌న్ కామ‌‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌‌సెట్‌‌)–2020 ప్రక‌‌ట‌‌న విడుదలైంది. ఓయూ ఈ ఏడాది టీఎస్​ఎడ్​సెట్​ను నిర్వహిస్తోంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు: బ్యాచిల‌‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌‌న్ (బీఈడీ)

కోర్సు వ్యవ‌‌ధి: రెండేళ్లు

అర్హత‌‌: ఏదైనా బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత‌‌.

వయసు: 2020 జులై 1 నాటికి 19 ఏళ్లకు పైబడి ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూట‌‌ర్ బేస్డ్ టెస్ట్‌‌ ద్వారా.

ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.650, ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగుల‌‌కు రూ.450

ద‌‌ర‌‌ఖాస్తుల ప్రారంభం: 2020 ఫిబ్రవరి 27

చివ‌‌రి తేది: 2020 ఏప్రిల్​ 20

ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ డేట్: 2020 మే 23

వెబ్​సైట్​: www.edcet.tsche.ac.in

టీఎస్ ​పీఈసెట్​–2020

రాష్ట్ర పరిధిలోని కళాశాలల్లో 2020–21 ఏడాదికి గాను బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రవేశాల‌‌కు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫిజిక‌‌ల్ ఎడ్యుకేష‌‌న్ కామ‌‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌‌పీఈసెట్) ప్రకటన విడుదలైంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు వ్యవధి: రెండేళ్లు; అర్హత: బీపీఈడీకి ఏదైనా డిగ్రీ, డీపీఈడీకి ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్: ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​ ద్వారా; ద‌‌ర‌‌ఖాస్తుల ప్రారంభం: 2020 ఫిబ్రవ‌‌రి 21; చివరితేది: 2020 ఏప్రిల్ 13; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.800, ఎస్సీ/ఎస్టీల‌‌కు రూ.400; పీఈటీ టెస్టుల ప్రారంభం: 2020 మే 13; వివరాలకు: www.pecet.tsche.ac.in

బీఆర్ఏఓయూ ఎలిజిబిలిటీ టెస్ట్​–2020

హైద‌‌రాబాద్‌‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల‌‌యం(బీఆర్ఏఓయూ).. 2020–21 ఏడాదికి గాను వివిధ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్–2020​ ప్రకటన విడుదలైంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: బీఏ/ బీకాం/ బీఎస్సీ; కోర్సు వ్యవధి: మూడేళ్లు. అర్హత‌‌: ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణులు కాని వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు; వ‌‌య‌‌సు: 2020 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: ఎలిజిబిలిటీ టెస్ట్​ ద్వారా; చివ‌‌రితేది: 2020 ఏప్రిల్​ 4;  ప‌‌రీక్షతేది: 2020 ఏప్రిల్​ 19; వివరాలకు: www.braouonline.in

ఇండియన్‌‌ కలినరీ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో..

ఇండియన్‌‌ కలినరీ ఇన్‌‌స్టిట్యూట్‌‌(ఐసీఐ).. ఎంబీఏ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు: ఎంబీఏ ఇన్‌‌ కలినరీ ఆర్ట్స్‌‌ కోర్సు వ్యవధి: మూడేళ్లు; అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణత; విభాగాలు: కలినరీ ఆర్ట్స్‌‌, హాస్సిటబిలిటీ, హోటల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ తదితరాలు; వయసు: 25 ఏళ్లు మించకూడదు; ఫీజు: జనరల్‌‌/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు రూ.500; చివరితేది: 2020 ఏప్రిల్‌‌ 27; వివరాలకు: www.ici.nic.in

ఎన్​ఎంఐఎంఎస్​లో..

నార్సీ మోంజీ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్​మెంట్ స్టడీస్.. 2020–21 ఏడాదికి గాను యూజీ, ఇంటిగ్రేటెడ్​ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: ఇంజినీరింగ్​, టెక్నాలజీ మేనేజ్​మెంట్, డిజైన్​, కామర్స్​, ఎకనామిక్స్, ఫార్మసీ, లిబరల్​ ఆర్ట్స్​, బ్రాండింగ్ అండ్​ అడ్వర్టైజింగ్​; అర్హత: ఇంటర్మీడియట్/డిప్లొమా ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: ఎన్ఎంఐఎంఎస్​–ఎన్​పాట్​ ఎంట్రెన్స్​ టెస్ట్​; చివరితేది: 2020 ఏప్రిల్ 30; ఎంట్రెన్స్​ టెస్ట్​ డేట్​: మే 9,10; వివరాలకు: www.nmims.edu

స్పా, విజయవాడలో…

విజయవాడలోని స్కూల్‌‌ ఆఫ్‌‌ ప్లానింగ్‌‌ అండ్‌‌ ఆర్కిటెక్చర్‌‌ (స్పా).. 2020–21 ఏడాదికి గాను పీజీ, పీహెచ్‌‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు: పోస్ట్‌‌గ్రాడ్యుయేట్‌‌, ఫుల్‌‌టైమ్‌‌ పీహెచ్‌‌డీ; అర్హత: పీజీ ప్రోగ్రామ్స్​కు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్​ డిగ్రీ, పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్స్​కు మాస్టర్స్‌‌ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్‌‌/జేఆర్‌‌ఎఫ్‌‌/సీడ్‌‌ స్కోర్‌‌ కలిగి ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, పవర్‌‌ పాయింట్‌‌ ప్రజెంటేషన్‌‌ ద్వారా; ఫీజు: పీహెచ్‌‌డీ ప్రోగ్రాములకు జనరల్/ఓబీసీలకు రూ.3000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.2000; పీజీ ప్రోగ్రాములకు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.1000; చివరితేది: 2020 మార్చి 6; వివరాలకు: www.spav.ac.in

ఐఐఎస్సీ, బెంగళూరులో..

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పీహెచ్​డీ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్​ డిగ్రీ, మాస్టర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత; విభాగాలు: మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫార్మసీ తదితరాలు; అర్హత: బీఈ/బీటెక్, ఎంబీఏ, బీఫార్మసీ ఉత్తీర్ణతతోపాటు గేట్/నెట్ జేఆర్​ఎఫ్​ అర్హత సాధించి ఉండాలి. చివరితేది: 2020 మార్చి 23; వివరాలకు: www.iisc.ac.in

ఐఐటీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌‌ ఎంబీఏ

ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఎగ్జిక్యూటివ్‌‌ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు: ఎగ్జిక్యూటివ్‌‌ ఎంబీఏ; అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం; విభాగాలు: ఇంజినీరింగ్​/ టెక్నాలజీ, ఫిజికల్​ సైన్సెస్​, స్టాటిస్టిక్స్​, ఆపరేషన్​ రీసెర్చ్​, కంప్యూటర్​ అప్లికేషన్​, ఎకనామిక్స్​, కామర్స్​ తదితరాలు; సెలెక్షన్ ప్రాసెస్​: కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.2500; చివరితేది: 2020 మార్చి 17; వివరాలకు: www.iitd.ac.in

ఎన్​ఐఏలో పీజీడీఎం

పుణెలోని నేషనల్‌‌ ఇన్సూరెన్స్‌‌అకాడమీ (ఎన్‌‌ఐఏ).. 2020–22 ఏడాదికి గాను పోస్ట్​ గ్రాడ్యుయేట్‌‌ డిప్లొమా ఇన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌(పీజీడీఎం) ప్రోగ్రాములో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తుకు అర్హులే. క్యాట్/సీమ్యాట్‌‌–2020 స్కోర్‌‌ కలిగి ఉండాలి. వయసు: 2020 జులై 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: అకడమిక్​ రికార్డ్, క్యాట్/సీమ్యాట్ స్కోర్​, జీడీ/ పర్సనల్‌‌ ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2020 మార్చి 15; వివరాలకు: www.niapune.org.in

ఐఎస్​ఐలో మాస్టర్స్​ డిగ్రీ

ఇండియన్‌‌ స్టాటిస్టికల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌(ఐఎస్​ఐ).. ఎంఎస్, ఎంటెక్‌‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్స్​: ఎంఎస్‌‌ ఇన్​ క్వాంటిటేవ్‌‌ ఎకనామిక్స్‌‌, ఎంటెక్‌‌ ఇన్​ కంప్యూటర్‌‌ సైన్స్‌‌, ఎంటెక్‌‌ ఇన్​ క్రిప్టోలజీ అండ్‌‌ సెక్యూరిటీ, మాస్టర్‌‌ ఆఫ్‌‌ మ్యాథ్‌‌మెటిక్స్‌‌; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్​, బీమ్యాథ్స్​ ఉత్తీర్ణత; ఫీజు: జనరల్‌‌ పురుషులకు రూ.1250, మహిళలకు రూ.750, ఇతరులకు రూ.625; చివరితేది: 2020 మార్చి 6; వివరాలకు: www.isical.ac.in

హోమీ బాబా సెంటర్‌‌ ఫర్‌‌ సైన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌లో..

టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫండమెంటల్​ రీసెర్చ్​(టీఐఎఫ్​ఆర్​) పరిధిలోని హోమీ బాబా సెంటర్‌‌ ఫర్‌‌ సైన్స్‌‌ ఎడ్యుకేషన్.. పీహెచ్‌‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్: పీహెచ్‌‌డీ ఇన్​ సైన్స్‌‌ ఎడ్యుకేషన్‌‌; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్‌‌, ఎంఏ/ఎంఎస్​డబ్ల్యూ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్​: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2020 మార్చి 31; వివరాలకు: www.hbcse.tifr.res.in.

మైనార్టీ గురుకులాల్లో…

తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎంఆర్ఈఐఎస్).. 2020–21 ఏడాదికి గాను మైనార్టీ గురుకుల పాఠ‌‌శాల‌‌, మైనార్టీ గురుకుల జూనియ‌‌ర్ క‌‌ళాశాలల్లో బ్యాక్​లాగ్​ సీట్ల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రవేశ తరగతులు: ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఇంటర్మీడియట్​ అర్హత: స‌‌ంబంధిత కింది త‌‌ర‌‌గ‌‌తిలో ఉత్తీర్ణత‌‌. తెలంగాణ‌‌ స్థానికులై ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రెన్స్​ టెస్ట్ ద్వారా. చివ‌‌రితేది: 2020 మార్చి 20. వివరాలకు: www.tmreis.telangana.gov.in