యాంత్రిక్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్

యాంత్రిక్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్

యూనియన్ ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ ఫోర్సెస్‌‌‌‌లో ఇండియన్ కోస్ట్ గార్డ్  నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, జనరల్ డ్యూటీ), యాంత్రిక్ ఖాళీల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 22 వరకు అప్లై చేసుకోవాలి. 

ఖాళీలు:  మొత్తం 300 పోస్టుల్లో నావిక్ (జనరల్ డ్యూటీ) లో 225 ఖాళీలు, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)లో 40, యాంత్రిక్ (మెకానికల్)లో 16, యాంత్రిక్ (ఎలక్ట్రికల్) లో 10, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)లో 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ (రేడియో/ పవర్)) ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నావిక్ పోస్టులకు బేసిక్ పే రూ.21700, యాంత్రిక్ పోస్టులకు బేసిస్ పే రూ.29200 చెల్లిస్తారు.

సెలెక్షన్​: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌‌‌‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అభ్యర్థులు రూ.250 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్​ ఫీజుతో సెప్టెంబర్​ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వెబ్​సైట్​www.joinindiancoastguard.gov.in సంప్రదించాలి.