కొవిషీల్డ్​ రెండో డోసు కోరినోళ్లకు ముందే వేయండి

కొవిషీల్డ్​ రెండో డోసు కోరినోళ్లకు ముందే వేయండి
  • కేంద్రానికి కేరళ హైకోర్టు సూచన

కోచి: కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ వేసుకున్నంక 4 వారాల తర్వాత రెండో డోసు వేసుకునేందుకు అవకాశమివ్వాలని కేరళ హైకోర్టు కేంద్రానికి సూచించింది. రెండు డోసులమధ్య గ్యాప్​తగ్గించుకోవాలని భావించేటోళ్లకు వీలు కల్పించాలంది. కొవిన్​ యాప్​లో అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో కోర్టు ఈ కామెంట్​ చేసింది. ప్రస్తుతం కొవిషీల్డ్​ వేసుకున్నోళ్లకు 84 రోజుల తర్వాత రెండో డోసు వేస్తున్నారు.విదేశాలకు వెళ్లేటోళ్లకు రెండో డోసు ముందే వేస్తున్నరు. 12 వారాల గ్యాప్​ రూల్​కు మినహాయింపు ఇస్తున్నారు. అదేవిధంగా కొవిషీల్డ్​ రెండో డోసును గడువు కన్నా ముందే వేసుకోవాలని భావించేటోళ్లకు కూడా ఈ మినహాయింపు ఎందుకు ఇవ్వరని కోర్టు ప్రశ్నించింది.