వరద సాయం కోసం మీ సేవలో అప్లై చేసుకోండి    

వరద సాయం కోసం మీ సేవలో అప్లై చేసుకోండి    

వరదలతో నష్టపోయి ఇంకా సాయం అందలేదనుకునేవారి కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు నిజంగా తమకు నష్టం వాటిల్లినట్లైతే వారందరికి ఇదే తమ విజ్ఞప్తి అన్నారు. ఎవరి ద్వారా పైరవీ చేయాల్సిన అవసరం లేదన్నారు. బాధితుల సహాయార్థం ఓ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవా సెంటర్లలో ఒక కొత్త అప్లికేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. ఎవరైనా అర్హులు ఉండి వారికి ఇంతవరకు సాయం లభించలేదు అంటే మీ సేవలో వారి పేరు, ఇంటి నెంబరు, ప్రాంతం, మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నంబరు, పిన్‌కోడ్‌ ఈ వివరాలను అందజేస్తే చాలన్నారు.

ఆ వివరాలను వెంటనే అధికారులు తీసుకుని పరిశీలించి ఒకవేళ మీరు బ్యాంకు అకౌంట్‌ వివరాలు ఇస్తే మళ్లీ తిరగాల్సిన పనికూడా లేకుండా మీ బ్యాంకు అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తారన్నారు. ఇందుకు తమది బాధ్యత అన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నిబద్దతతో ఉందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 550 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం అవసరమైతే ఇంకో రూ.100 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాబోదన్నారు మంత్రి కేటీఆర్ .