
పీజీ డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన వారు అప్రెంటిస్ చేసుకోవడానికి పవర్‌గ్రిడ్ అవకాశం కల్పిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1110 ఖాళీలను భర్తీ చేస్తుంది. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 76 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 1110
సదరన్ రీజియన్-–1 హైదరాబాద్ –76, సదరన్ రీజియన్–-2 బెంగళూరు–114, కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్) –44, నార్తర్న్ రీజియన్ –313, ఈస్టర్న్ రీజియన్–156, నార్తీస్టర్న్ రీజియన్ –127, ఒడిశా ప్రాజెక్ట్ –53, వెస్టర్న్ రీజియన్ –227 ఖాళీలు.
అర్హతలు: ఐటీఐ అప్రెంటిస్ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, డిప్లొమా అప్రెంటిస్ కోసం సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక.
స్టయిఫండ్: ప్రతి నెల రూ.11 వేల నుంచి రూ.15 వేల వేతనం ఇస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్స్ ప్రారంభం: 21 జులై
చివరితేదీ: 20 ఆగస్టు
వెబ్‌సైట్: www.powergridindia.com