
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పంపించిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హఠావో, బీసీ రిజర్వేషన్స్ బచావో ఉద్యమం చేపడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మణి మంజరి అధ్యక్షతన ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపితే పూల వర్షం కురిపిస్తామని, లేదంటే రాళ్ల వర్షం తప్పదన్ఆరు.