తగ్గనున్న ఇళ్ల ధరలు..పెరగనున్న కార్ల ధరలు

తగ్గనున్న ఇళ్ల ధరలు..పెరగనున్న కార్ల ధరలు

మరో రెండు రోజుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఏయే  రేట్లు పెరుగుతాయి? తగ్గుతాయి అని అందరి సందేహం. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ  కౌన్సిల్ కొత్త రేట్లు అమలుకానున్నాయి.  రూ.45 లక్షల లోపు ఉన్న ఇళ్లపై 8 శాతం ఉన్న జీఎస్టీని ఒకశాతానికి తగ్గించడం.. ఇంతకు ముందున్న 12 శాతం జీఎస్టీని 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త రేట్లలో భాగంగా ఇళ్ల ధరలు తగ్గనున్నాయి.

ఆర్బీఐ రెపో రేటును తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇంతకు ముందున్న రుణాలపై కూడా వడ్డీరేట్లు తగ్గుతాయి. ఏప్రిల్ 1 నుంచి పలు ఇన్సురెన్స్ ప్రీమియంలు కూడా తగ్గనున్నాయి.కార్ల ధరలు పెరగనున్నాయి. సీఎన్జీ వాహనాల రేట్లు కూడా పెరగనున్నాయి. అలాగే కిచెన్  లో అవసరమయ్యే సీఎన్జీ ఇంధనం రేట్లు తగ్గనున్నాయి.