
ఆప్టెరా ఆటో మొబైల్ సంస్థ కొత్త సోలార్ ఎలక్ట్రిక్ వెహికిల్‌తో ముందుకొచ్చింది. ఫండింగ్ లేని కారణంగా 2011లో ఆగిపోయిన ఈ సంస్థ లేటెస్ట్‌గా సోలార్ కారుతో మార్కెట్‌లోకి వచ్చేసింది. ఈ బ్రాండ్ టాప్ మోడల్ వెహికిల్ బ్యాటరీ 100 కేడబ్ల్యూహెచ్. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి మైళ్లు (1,606 కిలో మీటర్లు) వరకు వెళ్తుంది.
కొత్తగా ప్రవేశపెట్టిన ఆప్టెరా త్రీవీలర్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. బండి మీద ఉండే సోలార్ రూఫ్‌తో రోజుకు 72 కిలో మీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇందులో టాప్ మోడల్‌ను తీసుకుంటే సోలార్ ప్యానెళ్ల ద్వారా 1,600 కి.మీ.లు ప్రయాణించే చాన్స్ ఉంది. ఈ కారు ప్రారంభ మోడల్ ధర రూ. 20 లక్షలు ఉండొచ్చునని, హైఎండ్ ధర రూ. 33 లక్షలకు పైగా ఉండొచ్చునని తెలుస్తోంది. తొలి మోడల్‌కు పారాడిగమ్, రెండో దానికి పారాడిగమ్ ప్లస్‌గా పేర్లు పెట్టారు.