టీ ఉదయం తాగాలా.. సాయంత్రం తాగాలా.. ఏ టైం బెస్ట్

టీ ఉదయం తాగాలా.. సాయంత్రం తాగాలా.. ఏ టైం బెస్ట్

భారతదేశంలో ఉన్న జనాభా 64% మంది ప్రతిరోజు టీ తాగడానికి ఇష్టపడతారు. అందులో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం ఖచ్చితంగా టీ తాగుతారు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం సాయంత్రం టీ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

టీ తాగేవారు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే టీ తాగాలని, అతిగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది స్ట్రెస్ గా ఫీలైనా, లేదా సమయం, సందర్బం లేకున్నా టీని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ అలా పలు మార్లు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది రిఫ్రెషింగ్ కోసం సాయంత్రం పూట టీ తాగడం చూస్తూనే ఉంటాం. కానీ అది ఇంతా అస్సలు మంచిది కాదని అంటున్నారు.

సాయంత్రం పూట టీ తాగితే..

సాయంత్రం పూట టీ తాగితే శరీరంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో టీ తాగడం వల్ల అందులో ఉండే కెఫిన్ నిద్రలేమికి కారణమవుతుందని, డిటాక్స్, జీర్ణక్రియ, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అందుకే పడుకునే ముందుకు టీకి దూరంగా ఉండాలని డాక్టర్లు సైతం హెచ్చరిస్తూ ఉంటారు.


పాలతో చేసిన టీ తాగితే..

చాలా మంది పాలతో చేసిన టీని తాగడానికి ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. ఉద్యోగంలో భాగంగా రాత్రి పూట షిఫ్టుల్లో పనిచేసే వారు అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో టీ తాగుతారు. కానీ అదే పనిగా అడిక్షన్ చేసుకుని తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిదికాదని, ముఖ్యంగా సాయంత్రం వేళ టీ తాగకుండా మానేస్తేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.